హైదరాబాద్ – తెలంగాణాకు ఇప్పుడు మరో కొత్త టెన్షన్ ప్రారంభమైంది… హైదరాబాద్, న‌ల్గొండ‌, జిగిత్యాల జిల్లాల‌లోని లోని రొహింగ్యా క్యాంప్ ల‌లో ఉంటున్న పలువురు నిజముద్దిన్ తబ్లిగే జమాతే హాజరయ్యారు.. అలా హాజరైన వారిలో అధిక శాతం మంది ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి క్యాంపుల‌కు చేరుకోలేదు..ఈ విష‌య‌న్నా కేంద్రం హోంశాఖ గుర్తించింది.  దాంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదిలా ఉంటే తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అధిక భాగం హైదరాబాదులోనే నమోదవుతున్నాయి. దీంతో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

 

ఆ మద్య హైద‌రాబాద్ క్యాంప్ నుంచి 8 మంది, న‌ల్గొండ క్యాంప్ నుంచి 6 గురు, జ‌గిత్యాల క్యాంప్ నుంచి ఒక‌రు ప‌రారైన‌ట్లు గుర్తించారు. తాజాగా వారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.   తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరిలో ఒకరు మరణించారని... ఆరుగురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించామని... వారికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలిందని చెప్పారు. 

 

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ సీరియస్ గా కంటిన్యూ అవుతుందని.. పాస్ లు ఉన్నవారు వాటిని దుర్వినయోగం చేయరాదని.. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు. మే 7వ తేదీ వరకు ప్రతి ఒక్కరు లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: