క‌రోనా వైర‌స్‌పై పోరులో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌పంచానికి మార్గ‌ద‌ర్శంగా నిలిచారు. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌నిస్తున్నాయ‌ని, అందుకే భార‌త్ చాలా సుర‌క్షితంగా ఉంద‌ని ప్ర‌పంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి త‌న‌ను తాను కాపాడుకుంటూనే  అగ్ర‌రాజ్యాల‌తోపాటు పేద‌దేశాల‌ను కూడా భార‌త్ ఆదుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే అమెరికాతోపాటు ప‌లు దేశాల‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పారాసెట్‌మాల్ మాత్ర‌ల‌ను పంపి.. ప్ర‌పంచ దేశాల‌కు ప్రాణ‌మిత్రుడిగా మారారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. ఈ నేప‌థ్యంలోనే క‌రోనాపై పోరాటంలో మోడీ ఫ‌స్ట్‌ప్లేస్‌లో నిలిచారు. వైర‌స్‌ నియంత్రణ చర్యలను చేపట్టడంలో ప్రధాని మోదీ.. ప్రపంచ దేశాల అధినేతలకంటే ముందు వరులలో నిలిచారు.

 

క‌రోనా క‌ట్ట‌డిలో ఏ దేశ ప్ర‌ధానులు, అధ్య‌క్షులు బాగా ప‌నిచేస్తున్నార‌నే అంశంపై `మార్నింగ్ క‌న్స‌ల్ట్` నిర్వ‌హించిన స‌ర్వేను వీడీపీ అసోసియేట్స్ ప్ర‌క‌టించింది. ఈ సర్వే  ప్రకారం భార‌త ప్రధాని నరేంద్ర మోదీ 68 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.  మెక్సికో  అధ్యక్షుడు లోపేజ్ కు 36, యూకే ప్రధాని జాన్సన్ 35, ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్  26 పాయింట్లతో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇంకా  ఈ జాబితాలో ట్రుడావ్ కు 21, మెర్కెల్ 16, బోల్సోనారా 8 పాయింట్లతో ఉండగా, మార్కాన్ మైనస్ 21, షింజో అబే మైనస్ 33 పాయింట్లతో ఉన్నారు. అటు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఆయ‌న‌ మైనస్ 3 పాయింట్లతో చివ‌ర‌న నిలిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: