ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో  కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ లక్షణాలు ఉన్నవారు స్వచ్చందంగా ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుం టున్నారు.  గుంటూరులో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని  వైద్యులు చెబుతూనే ఉన్నారు.  తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా నివసిస్తూ నరసరావుపేటలో పనిచేస్తున్న వైద్యురాలికి పాజిటివ్ అని తేలడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. 

 

కాకపోతే ఆమె కుటుంబ సభ్యులకు ఎవరికీ కరోనా పాజిటీవ్ అని రాలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  అయితే ఆమెను ఎవరు కలిశారు.. అన్నివిషయంపై ఆరా తీస్తున్నారు.  మరోవైపు  జిల్లాలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నేడు కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి.

 

వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 177కు పెరిగినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.  కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు, నరసరావుపేటలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: