క‌రోనా మ‌హ‌మ్మారిపై అనేక రంగాల ఉద్యోగులు పోరాడుతున్నారు. దాని బారి నుంచి ప్ర‌జ‌ల‌కు కాపాడేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక మంది వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్న వైద్య‌సిబ్బందికి ఎక్కువ‌గా క‌రోనా సోకుతోంది. ఇప్ప‌టికే వైద్యులు, న‌ర్స‌లు, ఇత‌ర ఆస్ప‌త్రి సిబ్బంది క‌రోనా వైర‌స్‌బారిన‌ప‌డుతున్నారు. ఒక్క ముంబైలోనే ఏకంగా 250మంది హెల్త్‌వ‌ర్క‌ర్ల‌కు కొవిడ్‌-19 సోకింది.  ఆ త‌ర్వాత పోలీసులు,  జ‌ర్న‌లిస్టులు ఎక్కువ‌గా క‌రోనాబారిన‌ప‌డుతున్నారు. ముంబైలో ఏకంగా 52మంది జ‌ర్న‌లిస్టులకు కొవిడ్‌-19 సోకింది. ఆ త‌ర్వాత చెన్నైలోని ఓ ప్రైవేట్ చానెల్ సిబ్బందికి క‌రోనా సోకింది.

 

రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతుండ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వ స‌మాచార ప్ర‌సారాల శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. కొవిడ్‌-19 వార్త‌ల క‌వ‌రేజీకి క్షేత్ర‌స్థాయిలో ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టులు, ఫొటోగ్రాఫ‌ర్లు, కెమెరామెన్లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. కొవిడ్‌-19 కంటైన్మెంట్ జోన్లు, ప్ర‌భావిత ప్రాంతాల్లో వార్త‌లు సేక‌రించే క్ర‌మంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇదేస‌మ‌యంలో సంస్థ‌లు కూడా ఉద్యోగుల భ‌ద్ర‌త‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. అలాగే.. ఆఫీస్ స్టాఫ్‌ను అప్ర‌మ‌త్తంగా ఉంచాల‌ని సూచించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: