కేసీఆర్‌.. ద‌శాబ్దాల స్వరాష్ట్ర క‌ల‌ను నెర‌వేర్చి తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో గూడుక‌ట్టుకున్న‌ నేత‌. ముఖ్య‌మంత్రిగా ఆయ‌న అందిస్తున్న సేవ‌ల‌కు ప్ర‌జ‌లు జేజేలు ప‌లుకుతున్నారు. ఇక ఆయ‌నకు సంబంధించిన ప్ర‌తీ విష‌యం ప్ర‌జ‌లకు ఎంతో ప్ర‌త్యేకం. ఆయ‌న ప్ర‌సంగించినా.. ముచ్చ‌ట చెప్పినా.. ప్ర‌జ‌ల‌కు పండుగేమ‌రి. అయితే.. కేసీఆర్ జీవితంలో అత్యంత విలువైన రోజు ఏప్రిల్ 23.. ఈ రోజు కే‌సీఆర్‌-శోభ‌ల పెళ్లి రోజు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్‌కుమార్ కేసీఆర్ పెళ్లి నాటి ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. * మీలాంటి అమ్మానాన్న‌లు ఉండ‌డం అదృష్టం. పెద్ద‌నాన్న, పెద్ద‌మ్మా.. నా జీవితంలో మీరు ఎంతో ప్ర‌త్యేకం. నాకు జీవితాన్ని ఇచ్చారు. మీకు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు.. ఆయురారోగ్యాల‌తో, సుఖ‌సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకుంటున్నా* అంటూ ట్వీట్ చేశారు.

 

ఎంపీ సంతోష్‌కుమార్ పోస్ట్ చేసిన కేసీఆర్ పెళ్లినాటి ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆ అరుదైన‌ ఫోటోలను చూసి గులాబీ శ్రేణులు, అభిమానులు ఆనందప‌డుతున్నారు. వాటిని ఎంతో ఆస‌క్తిగా చూస్తూ.. షేర్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో సీఎం కేసీఆర్‌కు పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: