క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌జ‌లు స్వీయ‌నియంత్ర‌ణతో సామాజిక‌దూరం పాటించాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు, పోలీసులు ప‌దేప‌దే చెబుతున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌నల‌ను గౌర‌వించాల‌ని మొత్తుకుంటున్నారు. కేవ‌లం నిత్యావ‌స‌రాలు, అత్య‌వ‌స‌రాల కోసం మాత్ర‌మే ఇంటికి ఒక్క‌రు చొప్పున బ‌య‌ట‌కు రావాల‌ని సూచిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే తామే మీకు కావాల్సిన వ‌స్తువుల‌ను ఇంటికి తీసుకొచ్చి ఇస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు. అయినా.. అక్క‌డ‌క్క‌డ ప‌లువురు లాక్‌డౌన్ నిబంధ‌న‌లను పాటించ‌డం లేదు. వారి ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు.

 

ఈ క్ర‌మంలో పోలీసులు కూడా చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌దైన శైలిలో ప‌నిష్ చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే ఏపీలో తూర్పుగోదావ‌రి జిల్లా మ‌కిలిపురం మండ‌లం బ‌ట్టెలంక హైస్కూల్‌లో కొంద‌రు యువ‌కులు ఏకంగా క్రికెట్ ఆడుతుండ‌గా ఎస్సై నాగ‌రాజు అక్క‌డికి చేరుకున్నారు. వెంట‌నే వారికి వార్నింగ్ ఇచ్చారు. యువ‌కులంద‌రితో డిప్స్ కొట్టించారు. యువ‌కులు డిప్స్ కొడుతున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: