ప‌విత్ర రంజాన్ మాసం ఈనెల 25వ తేదీ నుంచి ఆరంభం కాబోతోంది. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముస్లింల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. *పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. మీ ప్రార్థనలను ఇంటికే పరిమితం చేసి క్షేమంగా దీక్షా మాసాన్ని గడపండి. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలి. కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడాలని ప్రార్థించండి* అంటూ చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా ప‌విత్ర మాసంపై కేంద్రం ప్ర‌త్యేకంగా మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

 

ఇళ్ల‌లోనే ముస్లింలు ప్రార్థ‌న‌లు చేసుకోవాల‌ని, మ‌సీదుల్లో సామూహిక ప్రార్థ‌న‌లు చేయొద్ద‌ని సూచించింది. ఇంట్లోనే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రార్థ‌న‌లు, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుకోవాల‌ని, ఇదే స‌మ‌యంలో సామాజిక దూరం పాటించాల‌ని సూచించింది. ఈ మేర‌కు వ‌క్ఫ్‌బోర్డుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై వ‌క్ఫ్‌బోర్డులు ముస్లింల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: