లాక్‌డౌన్ కార‌ణంగా ఇళ్ల‌లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోలు,ద‌ర్శ‌కులు, సంగీత ద‌ర్శ‌కులంద‌రూ ఇప్పుడు *బీ ద రియ‌ల్ మ్యాన్* ఛాలెంజ్‌లో బిజీ అయిపోయారు. ఇంటి ప‌నులు చేస్తూ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మ‌రొక‌రికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఇల్లూవాకిలి ఊకుతూ కొంద‌రు.. బోళ్లు తోముతూ మ‌రికొంద‌రు.. బ‌ట్ట‌లు ఉతుకుతూ ఇంకొంద‌రు.. ఇలా అన్నిర‌కాల ఇంటిప‌నుల‌ను స్వ‌యంగా చేస్తూ ఆ వీడియోల‌ను షేర్ చేస్తున్నారు. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన వారు ఇంటిప‌నులు చేస్తూ.. మిగ‌తావారికి ఛాలెంజ్ విసురుతున్నారు.

 

నిన్న‌ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ఇంటిప‌నుల‌న్నీ చేసి *మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం* అంటూ  బాల‌య్య‌కు, చిరంజీవికి, వెంక‌టేశ్‌కు, కొర‌టాల శివ‌కు ఛాలెంజ్ విసిరాడు. అయితే.. దీనిపై హీరో వెంక‌టేశ్ వెంట‌నే స్పందించాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను స్వీక‌రించాడు. అయితే.. ఇక్క‌డో మెలిక పెట్టాడు. మా గ్యాంగ్ లీడ‌ర్ చిరంజీవి వీడియో కోసం ఎదురు చూస్తున్నానంటూ ట్వి్ట్ట‌ర్లో పేర్కొన్నాడు. దీనిపై ఈ రోజు ఉద‌యం చిరు స్పందించాడు. వెంకీ మామ‌.. వ‌స్తున్నా..కాచుకో అంటూ చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలోని సాంగ్‌ను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: