ప్రపంచంలో కరోనా వైరస్ పేరు చెబితే గడ గడ వణికి పోతున్నారు.   అగ్రరాజ్యమైన అమెరికాను సైతం భీతిల్లిపోయేలా చేసింది ఈ కరోనా మహమ్మారి.  తాజాగా కరోనాతో అల్లాడుతున్న అమెరికాను ఇప్పుడు మరో వార్త వణికిస్తోంది.  కరోనా వైరస్ మొట్టమొదటిసారి రెండు పెంపుడు పిల్లులకూ సోకడం సంచలనం రేపింది.  న్యూయార్క్‌లో రెండు పిల్లులకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యాధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), యూఎస్ డీఏ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీస్ (ఎన్‌వీఎస్ఎల్) ధ్రువీకరించాయి. 

 

కరోనా వైరస్ సోకిన రెండు పెంపుడు పిల్లులు న్యూయార్క్ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల నివశిస్తున్నాయని, ఇవి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాయని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ అధికారులు చెప్పారు. అదృష్టం ఏంటంటే ఈ పిల్లు పెంచుకుంటున్న యజమానులకు మాత్రం కరోనా సోకలేదని డాక్టర్లు చెబుతున్నారు.  కరోనా సోకిన బయటి వ్యక్తుల నుంచి వీటికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

 

పిల్లులకు ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన విషయం తెలియడంతో ప్రపంచం మొత్తం ఇప్పుడీ విషయంపై చర్చించుకుంటోంది. న్యూయార్క్ రాష్ట్రంలో 2,58, 589 మందికి కరోనా సోకగా, వారిలో 15,302 మంది మరణించారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 1,41,235 మందికి కొవిడ్-19 సోకింది. మొత్తంమీద రెండు పెంపుడు పిల్లులకు కూడా కరోనా సోకడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: