దేశంలో కరోనాని కట్టడి చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కట్టుదిట్టంగా లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు.  కానీ కొంత మంది చేస్తున్న నిర్లక్ష్యం వల్ల కరోనా ఇంకా పూర్తి స్థాయిలో కట్టడి కాలేక పోతుందని అంటున్నారు.  ప్రతిరోజూ వార్తల్లోచూస్తూనే ఉన్నాం.. లాక్ డౌన్ నిబంధనలు చేస్తూ రోడ్లపై శిక్షలు అనుభవిస్తున్నారు.  అయితే మాకు కరోనా రాలేదు మేం ఆరోగ్యంగా ఉన్నాం అంటూ కొంత మంది నిర్లక్ష్యంగా ఉండటం పెను ప్రమాదంగా మారుతుంది.. తీరా వాళ్లకు టెస్ట్ లు చేస్తే కరోనా అని బయట పడుతుంది.

 

తాజాగా తిరువళ్లూర్‌ జిల్లా కడంబత్తూర్‌ యూనియన్‌ పేరంబాక్కంకు చెందిన బట్టల వ్యాపారికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు చుట్టుప్రక్కల ప్రాతాలను అప్రమత్తం చేశారు.  ఈ వ్యాపారి ఇటీవల ఢిల్లీలో ముజాహిద్దీన్ మర్కజ్ ప్రార్థన సమావేశంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. దీంతో అతనిని అధికారులు తిరుత్తణి-తిరువళ్లూర్‌ రహదారిలో ఉన్న డీడీ మెడికల్‌ కళాశాల భవనంలో క్వారంటైన్‌లో ఉంచి, వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

 

 కాగా, ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 24 నుంచి 31 వరకు తన షాపు తెరిచి వ్యాపారం కొనసాగించారు.  దాంతో అతని వద్దకు వెళ్లిన కస్టమర్లకు భయం పట్టుకుంది.  అయితే  ఆ సయమంలో దుకాణానికి వచ్చిన వారు క్యారంటైన్‌లో వుండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: