క‌రోనా క‌ల్లోలం ఎప్పుడు ఎవ‌రిని ఏం చేస్తుందో ?  ఎవ‌రికి ఎలా వ‌స్తుందో ?  కూడా అర్థం కావ‌డం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌ట‌కే కొన్ని చోట్ల క‌రోనా భారీన ప‌డిన వారికి నెగిటివ్ వ‌చ్చినా మ‌ళ్లీ పాజిటివ్ వ‌స్తుండ‌డంతో అంద‌రూ ఆందోళ‌న‌కు గుర‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఏపీలోనూ ఇదే స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వ్వడంతో ప‌లువురు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజమండ్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి నెల రోజుల క్రితం వైరస్ పరీక్షలు చేశారు. అందులో నెగిటివ్ వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన అనంతరం తిరిగి ఇళ్లకు పంపారు. ఈ క్ర‌మంలోనే మ‌ర్క‌జ్‌కు వెళ్లి వ‌చ్చిన వారిని జ‌ల్లెడ ప‌ట్టి మ‌రీ గుర్తించాక వారిని క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పుడు వారికి ముందు ప‌రీక్ష‌లు చేసిన‌ప్పుడు నెగిటివ్ వ‌చ్చింది. తీరా ఇప్పుడు అదే వ్య‌క్తికి నెగిటివ్ రావ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు.

 

ఈ క్ర‌మంలోనే ఈ ఒక్క‌ వ్యక్తికి తిరిగి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారందరికీ తిరిగి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాంటి కేసులు ఆరు నమోదయ్యాయి. దీంతో రెడ్ జోన్ లో నిబందనలను కఠినతరం చేసింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: