వలస కూలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో వలస కూలీలను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటీషన్ పై హైకోర్ట్ విచారణ జరిపింది. వాళ్లకు పది వేలు ఆర్ధిక సహాయం తో పాటుగా వసతి కల్పించాలని ఆయన పిటీషన్ వేసారు. ఈ సందర్భంగా వాళ్లకు ఉండటానికి అన్ని సదుపాయాలను కల్పించాలని, ఆహారం, వైద్యం, వసతి కల్పించాలని సూచనలు చేసింది రాష్ట్ర హైకోర్ట్. 

 

ఏపీలో వలస కూలీలు బాగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన లక్షల మంది వలసకూలీలు ఏపీలో ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఊళ్లకు వెళ్ళడానికి వేలాది కిలోమీటర్లు నడక మొదలుపెట్టారు. దీనితో వారిలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణా ప్రభుత్వం మినహా ఏ ఒక్క ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: