బుల్లితెర‌పై త‌నదైన పంచుల‌తో అన‌తి కాలంలోనే అగ్ర‌స్థానాన్ని అందుకున్నాడు హైప‌ర్ ఆది. ఇప్పుడు బుల్లితెర‌పై మ‌హా మ‌హా న‌టులు, యాంక‌ర్ల‌నే తోసిరాజ‌ని క్రేజ్ హైప‌ర్ ఆది సొంతం అయ్యింది. హైప‌ర్ ఆది స్కిట్ వ‌స్తుందంటే న‌వ్వుల‌కు కొద‌వే ఉండ‌దు. జ‌బ‌ర్ద‌స్త్ లో ఉన్న టీంలో హైప‌ర్ ఆదికి ఉన్న క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక కొద్ది రోజులుగా ఆది ఎఫైర్ల‌తో వార్త‌ల్లో ఉంటున్నాడు. 

 

మ‌ధ్య‌లో ఆది అన‌సూయ‌తో క్లోజ్‌గా ఉంటున్నాడ‌న్న పుకార్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత యాంకర్ వర్షిణితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడ‌ని పుకార్లు పుట్టించారు. ఈ నేప‌థ్యంలో త‌న పెళ్లి డేట్‌, వ‌ధువు ఎవ‌ర‌నే విష‌యాన్ని చెప్పి అంద‌రి నోళ్ళు మూయించాడు హైప‌ర్ ఆది. త‌న పెళ్లి ఫిక్స్ అయిపోయింద‌ని... త‌న త‌ల్లిదండ్రులు త‌న కోసం అమ్మాయిని వెతికార‌ని.. ఆమెది ప్ర‌కాశం జిల్లా అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక వ‌చ్చే యేడాది త‌మ పెళ్లి ఉంటుంద‌న్న విష‌యం కూడా చెప్పాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: