దేశం మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ లో ఉంది.  అన్ని వ్యవస్థలు ఆగిపోయాయి. ఒక్క నిత్యావసర వస్తువులకు మాత్రమే పరిమిషన్ ఉంది. కానీ రోజు రోజుకీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ఈ మాయదారి కరోనా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 1409 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 21,393కి పెరిగింది.

 

ఇప్పటివరకు 4,257 మంది కోలుకున్నారు. రోగుల రికవరీ రేటు 19.89గా నమోదైంది.  భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,454గా కేంద్రం వెల్లడించింది. మొత్తం భారత్‌లో ఇప్పటివరకూ 4,257 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. భారత్‌లోని 12 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాదు, మరో 78 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి కొత్త కేసు నమోదు కాలేదని కేంద్రం ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం.  ఈ కరోనా కేసులు పెరుగుదలకు ముఖ్య కారణం చాలా మంది లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారని.. మర్కజ్ ప్రార్థనల ప్రభావం అని అంటున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: