ఈటీవీ.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న చానెళ్ల‌లో టాప్‌లోనే ఉంటుంది. అల‌నాటి తెలుగు చిత్రాల‌తోపాటు ఇత‌ర వినోద‌భ‌రిత కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేస్తూ ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌దైన ముద్ర‌వేసింది. అందుకే ఈటీవీ ఎప్పుడూ టాప్ 3లోపే కొన‌సాగుతుంది. అయితే.. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో గ‌తంలో ప్ర‌సారం చేసిన వినోద‌భ‌రిత కార్య‌క్ర‌మాల‌ను ఎక్కువ‌గా ప్ర‌సారం చేయ‌డంతో మూడు వారాల నుంచి రికార్డుస్థాయిలో టీఆర్పీ రేటింగ్స్, భారీ స్థాయి వ్యూవర్ షిప్స్ తో మొద‌టి స్థానంలో నిలుస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు అంటే తాజాగా విడుద‌ల చేసిన లిస్ట్‌లో మాత్రం ఈటీవీ ఫ‌స్ట్ ప్లేస్‌ను కోల్పోయి రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది.

 

బ్రాడ్ క్యాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా వారు గత వారపు టాప్ 5 ఛానెల్స్ జాబితాను విడుదల చేసింది. అందులో చాలా రోజుల తర్వాత స్టార్ మా నెంబర్ 1 స్థానంలో నిలవగా 2 వ స్థానంలో ఈటీవీ నిలిచింది. ఈ జాబితాలో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం... “స్టార్ మా” ఛానెల్‌కు గత వారంలో 52 లక్షల 79 వేలకు పైగా ఇంప్రెషన్స్ రాగా “ఈటీవీ” ఛానెల్ కు 51 లక్షల 48 వేలకు పైగా ఇంప్రెషన్స్ వచ్చాయి. ఎలాంటి కొత్త సినిమా కూడా లేకుండానే కేవలం లక్ష ఇంప్రెషన్లు తేడా రావడం విశేషం. ఇంకా అలాగే మూడో స్థానంలో 49 లక్షల ఇంప్రెషన్స్‌తో జెమినీ టీవీ, 40 లక్షల ఇంప్రెషన్స్ తో జీ తెలుగు నాలుగో స్థానంలో, అలాగే జెమినీ మూవీస్ ఛానెల్ 30 లక్షల ఇంప్రెషన్స్ తో టాప్ 5 లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: