దేశంలో ఓ వైపు సీరియస్ గా లాక్ డౌన్ అమలు అవుతుంది.  పోలీసులు తమ డ్యూటీ ఎంతో అద్భుతంగా చేస్తున్నారని సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. కానీ ఓ పోలీస్ అధికారి చేసిన నీచ పనికి హవ్వా ఇంత కక్కుర్తా అని తెగ తిట్టుకుంటున్నారు.  వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు రోడ్డెక్కకుండా చూస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప..ప్రయాణం చేయవద్దని అటు ప్రభుత్వం..ఇటు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయిన అక్రమమార్గంలో ప్రయాణాలు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ లో తనిఖీలు చేస్తున్నారు.

 

ఏ కారణం లేకుండానే రోడ్డు మీదకు వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.  తాజాగా ఓ యువకుడు తనకు కార్ పాస్ కావాలని రాచకొండ కమీషనర్ ను కోరాడు.  దానికి వారు ససేమిరా అన్నారు.. దాంతో న స్నేహతుడు ఫ్రిజ్ ఇస్తే..మంచిర్యాల ఏసీపీ కార్ పాస్ ఇచ్చారని చెప్పాడు. అదే తరహాలో తనకూ కార్ పాస్ ఇవ్వాలని  కోరడంతో తీగ లాగితే డొంక కదిలినట్లు సదరు  ఏసీపీ భాగోతం బయట పడింది.

 

విషయం తెలుసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణను డీజీపీ కార్యలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కార్ పాస్ కోసం రీ ఫ్రిజ్ ని బహుమానంగా తీసుకున్న  ఏసీపీపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: