మామూలుగా ఒక్కో బౌలర్ ఒక్కో రీతిలో బౌలింగ్ చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే బౌలర్ లు బౌలింగ్  చేసేటప్పుడు బాల్ ని బాగా రుద్దుతూ ఉంటారు. మామూలుగా కొత్త బంతి తో బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కొత్త బంతికి ఉన్న మెరుపును పోగొట్టేందుకు నోటిలోని లాలాజలాన్ని బంతికి అంటించి బాగా రుద్దుతూ ఉంటారు. ఇలా  క్రికెట్ బంతికి లాలాజలాన్ని అంటించి బాగా రుద్దడం చేస్తూ ఉండటం కామన్ . ఇది సాధారణంగా క్రికెట్లో ఎప్పుడూ చూస్తూనే ఉంటాము . అయితే తాజాగా బాల్ షైనింగ్ పై   భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా  వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇకపై బాల్ షైనింగ్  చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు సచిన్ టెండూల్కర్. అంతేకాకుండా మైదానంలో వికెట్ పడితే అప్పుడు ఆటగాళ్లు చేసుకునే సంబరాల్లో కూడా పలు మార్పులు రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు సచిన్ టెండూల్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: