బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌హోనా ప్యార్ హై సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హృతిక్ దేశ వ్యాప్తంగా ఎంతో మంది అమ్మాయిల క‌లల రాకుమారుడు అయ్యాడు. తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో హృతిక్ కు దేశ‌వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. ఆ టైంలో హృతిక్ అప్ప‌టి బాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న షారుఖ్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, అమీర్ ఖాన్ లాంటి వాళ్ల‌కు స‌రిస‌మాన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే మ‌ధ్య‌లో హృతిక్ వైవాహిక జీవితం మాత్రం విచ్ఛిన్న‌మైంది. 

 

త‌న చిన్న‌ప్ప‌టి గ‌ర్ల్ ఫ్రెండ్ సుసానే ఖాన్‌ను వివాహం చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రి అయ్యాక కూడా సుసానేకు విడాకులు ఇచ్చాడు. ఇక అప్ప‌టి నుంచి హృతిక్ కెరీర్ అంతంత మాత్రంగానే ముంద‌కు వెళుతోంది. మ‌ధ్య‌లో పిల్ల‌ల కోసం భార్య‌తో క‌ల‌వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. తాజాగా లీక్ అయిన హృతిక్ ఫొటో చూస్తే అర్రె హృతిక్ ఇలా అయిపోయాడేంట‌ని అంద‌రూ షాక్ అవ్వాల్సిందే. హృతిక్ ఫేస్‌లో క‌ళ అంతా త‌ప్పిపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: