ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు శుక్ర‌వారం ఉద‌యం లెక్క‌లు చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బాధితులు ఏకంగా 27 లక్ష‌ల‌కు చేరుకున్నారు. ఇక క‌రోనా మ‌ర‌ణాలు 1.91 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక క‌రోనా రిక‌వ‌రీ కేసులు 7.49 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక మ‌న‌దేశంలో కూడా క‌రోనా కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు 23 వేలు క్రాస్ అయ్యాయి. క‌రోనా మ‌ర‌ణాలు 722కు చేరుకున్నాయి. 

 

మ‌న‌దేశంలో మ‌హారాష్ట్ర‌.. యూపీ, బిహార్ లాంటి రాష్ట్రాల‌లో క‌రోనా కేసులు గంట గంట‌కు పెరిగిపోతున్నాయి. అయితే అతి చిన్న రాష్ట్ర‌మైన త్రిపుర మాత్రం క‌రోనాపై పూర్తిగా విజ‌యం సాధించింది. ఈ రాష్ట్రంలో ఉన్న రెండు పాజిటివ్ కేసులు కూడా నెగిటివ్ అవ్వ‌డంతో త్రిపుర మ‌న‌దేశంలో కోవిడ్ ర‌హిత రాష్ట్రాల్లో మూడోదిగా నిలిచింది. ఈ విష‌యాన్ని త్రిపుర సీఎం విప్ల‌వ్‌ కుమార్ దేబ్ ప్రకటించారు. మణిపూర్ మరియు గోవా తరువాత మూడో కోవిడ్ ర‌హిత రాష్ట్రంగా రికార్డుల‌కు ఎక్కింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: