కరోనా వైరస్ అనేది ఇప్పుడు ప్రజల జీవితాల్లో అత్యంత ముఖ్యాంశంగా మారింది.  ప్రపంచ వ్యాప్తంగా మనుషులకు కంటిమీద కునుకు లేకండా చేస్తుంది ఈ మాయదారి కరోనా.  దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కరోనా కట్టడి చేయడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే కరోనా పూర్తిగా రూపు మాపాలని రాష్ట్రాల్లో వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం మే 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇక దేశంలో మహరాష్ట్ర తర్వాత కర్ణాటక, తమిళనాడులో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

 

తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని పాద్రాయణపుర జైలులో ఇద్దరు ఖైదీలకు కరోనా వైరస్ సోకిన ఘటన సంచలనం రేపింది.  ఓ ఆరోగ్య కార్యకర్తపై దాడి చేసిన కేసులో నిందితులైన 119 మందిని పోలీసులు అరెస్టు చేసి వారిని రామనగర ప్రాంతంలోని పాద్రాయణపుర జైలుకు తరలించారు.  వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించారు.

 

 కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున ఖైదీలను రామనగర జైలు నుంచి మరో జైలుకు తరలించాలని జేడీ(ఎస్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి డిమాండు చేశారు. ఖైదీలకు కరోనా వచ్చినందున జైలు సిబ్బంది, పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని కుమారస్వామి సూచించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: