క‌రోనా ఎప్పుడు ఎవ‌రిని పొట్ట‌న పెట్టుకుంటుందా ? ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డిన వాళ్లలో ఎవ‌రు బ‌తుకుతారో ?  ఎవ‌రు చ‌నిపోతారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వృద్ధులు, అనారోగ్యం భారీన ప‌డిన‌వారు మాత్ర‌మే చనిపోతార‌న్న సందేహాలు ఉండేవి. అయితే ఇప్పుడు ఎలాంటి అనారోగ్యాలు లేనివారు... సంపూర్ణ ఆరోగ్య వంతులు, యువ‌కులు కూడా చ‌నిపోతున్నారు. దీంతో ఇది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో చెప్ప‌క‌నే చెపుతోంది. తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌నే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

 

కేరళలో కరోనాతో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సఖ్య నాలుగుకు చేరింది. హార్ట్ సంబంధిత వ్యాధితో స‌ద‌రు చిన్నారి కోజికోడ్ మెడిక‌ల్ కాలేజ్ హాస్ప‌ట‌ల్లో ఏప్రిల్ 21న చేరింది. రెండు రోజుల తర్వాత ఆ చిన్నారికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని బయటపడింది. గుండెపోటుతో ఆ పాప శుక్రవారం ఉదయం మరణించింది. ఆ చిన్నారికి అస‌లు క‌రోనా ఎలా ?  సోకిందో ? ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. 

 

ఇక ఆ పాప‌కు వైద్యం చేసిన ఐదుగురు డాక్టర్లు, ఆ పాప తల్లిదండ్రులను క్వారంటైన్‌కు తరలించామని ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ట్విస్ట్ ఏంటంటే కొద్ది రోజుల క్రిత‌మే కరోనా సోకిన 9 నెలల చిన్నారి క‌రోనాను జయించి విజేత అయితే నాలుగు నెల‌ల చిన్నారి మాత్రం క‌రోనా కాటుకు బ‌లైపోయింది.
 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: