ప్రపంచం మొత్తం కరోనా  వైరస్ తో పోరాటం చేస్తున్న వేళ ప్రపంచ దేశాలకు భారత్ తగిన సహాయాన్ని అందజేస్తున్న  విషయం తెలిసిందే. ప్రస్తుతం మలేరియా మందు హైడ్రోక్సీక్లోరోక్విన్ మందును  కరోనా  వైరస్ నివారణకు మందులు పంపిణీ చేస్తూ ప్రపంచ దేశాలకు బాసటగా నిలుస్తోంది. ఇక తాజాగా సింగపూర్కు కూడా సహాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వచ్చారు. నిన్న టెలిఫోన్ ద్వారా సింగపూర్ ప్రధానితో మాట్లాడిన నరేంద్ర మోడీ... కరోనా  వైరస్ పై  ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి అభిప్రాయాలను  చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే సింగపూర్ కు  వైద్య ఉత్పత్తుల తో సహా అవసరమైన వస్తువుల సరఫరాను అందించడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. సింగపూర్ లోని భారతీయ పౌరులకు మద్దతు ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ  ప్రశంసలను వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: