ఓ వైపు క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచం అంతా అత‌లా కుత‌లం అవుతోంది.  మ‌న దేశంలో మే 3వ తేదీ వ‌ర‌కు చాలా స్ట్రిక్ట్‌గా లాక్ డౌన్ అమ‌లు కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌తి చిన్న విష‌యంలోనూ చాలా ఎలెర్ట్ అవుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు జాతీని ఉద్దేశించి ప్ర‌సంగాలు చేస్తూ ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపుతున్నారు. ఈ క్ర‌మంలోనే వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ వారు రాష్ట్రాల్లో ఏం చేయాలో తెలుసుకుంటున్నారు.

 

తాజాగా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పంచాయ‌తీ రాజ్ శాఖా మంత్రుల‌తో పాటు ఉత్త‌మ అవార్డులు పొందిన సర్పంచులు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శులు, క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఉత్త‌మ అవార్డులు పొందిన స‌ర్పంచ్‌లు ఏం చేస్తున్నారో ?  అడిగి తెలుసుకున్నారు.

 

అలాగే ఉత్తమ గ్రామపంచాయతీలకు గ్రామస్వారాజ్‌ పోర్టల్‌ అండ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా అవార్డులు ఇచ్చారు.  కరోనా లాక్‌డౌన్‌ను పాటిస్తున్న విధానాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: