దేశంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇంటి పట్టున ఉంటున్నారు.  ఈ కరోనా వైరస్ కి రాజు పేద అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి దేశ అధ్యక్షులను కూడా భయపెట్టిస్తుంది.  క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించడంతో పాటు రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లి వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డిని అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు.ఈ మేరకు ఆయన ఇంటికి బుధవారం నోటీసును అంటించారు. 28 రోజుల‌ పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.  కాగా నోటీసులిచ్చేందుకు అధికారులు వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో ఉండి కూడా.. లేనని చెప్పించ‌డంతో నోటీసు గోడకు అతికించాల్సి వచ్చిందని కదిరి తహసీల్దార్‌ మారుతి తెలిపారు.  

 

అయితే ఈ వార్తలపై ఆయన స్పందించారు. స్థానిక సీఐ, ఎస్సైలకు తెలియకే తన ఇంటికి నోటీసులు అతికించారని అన్నారు.  వ్యక్తిగతంగా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు.  తనకు కేంద్ర సహాయ మంత్రి హోదా ఉంటుందని... దేశంలో ఎక్కడికైనా తిరిగే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. వీటిపై అవగాహన లేని వ్యక్తులు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

 

తనకు 24 గంటల పాటు సెక్యూరిటీ ఉంటుందని... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనకు భద్రతను కల్పిస్తాయని విష్ణు తెలిపారు.  జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రులను క్వారంటైన్లో పెడతారా? అని ప్రశ్నించారు.  కాగా, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కి విష్ణువర్ధన్ రెడ్డి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: