దేశంలో ఎప్పుడైతే కరోనా ప్రబలుతూ వస్తుందో దాని ఎపెక్ట్ ఎక్కువగా కేరళాపై చూపించింది.  కానీ ఇప్పుడు అక్కడు దాదాపు కంట్రోల్ కి వచ్చిందని అంటున్నారు. ఇక మహరాష్ట్ర దీని విజృంభన బీభత్సంగా పెరిగిపోయింది.  ఆ తర్వాత రాజస్థాన్.. తమిళనాడు లో పెరుగుతూ వచ్చింది. కరోనా వైరస్‌ ఎవర్నీ వదలడం లేదు. అందరిని వెంటాడుతూ చంపేస్తుంది. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతోంది.  కోయంబత్తూర్‌లో ఏడుగురు పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. ముగ్గురు మహిళా సిబ్బందితో పాటు మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పోలీసు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

 

ఈ నేపథ్యంలో  కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి మరో ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని అన్నారు.   కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుప్పూర్‌లలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

 

చెన్నై, కోయింబత్తూరు, మదురైలను ఈ నెల 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేయనున్నట్టు చెప్పారు. ఆ రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందన్నారు.ఆదివారం నుంచి 28 వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: