ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని క‌మ్ముకుంటోన్న వేళ ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా క‌ఠినంగా లాక్ డౌన్ అమ‌లు అవుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువుగా ఉండ‌డంతో చాలా క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లు అవుతున్నాయి. అక్క‌డ చాలా మంది వ‌ల‌స కూలీలు సైతం భోజ‌నం చేసేందుకు కూడా నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే జీహెచ్ఎంసీ అదిరిపోయే ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకొంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040- 21111111కి ఫోన్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు. 

 

గ్రేట‌ర్ ప‌రిధిలో మాత్ర‌మే కాకుండా మొత్తం తొమ్మ‌ది కార్పొరేష‌న్ల‌లో 300 అన్న‌పూర్ణ క్యాంటిన్ల ద్వారా ప్ర‌తి రోజు రెండు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు రెండు పూట్లా భోజ‌నం పెడుతున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో మరో 50 అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు భోజనం అందించేలా వేళలు కూడా మార్చామన్నారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలని, జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా అహారాన్ని కోరవచ్చని చెప్పారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: