కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ నుంచి మ‌రికొన్నింటికి స‌డ‌లింపులు ప్ర‌క‌టించింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ స్థానికంగా ఉన్న దుకాణాలను తెర‌చుకోవ‌డానికి అనుమితిని ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. మ‌ల్టీ, సింగిల్ బ్రాండ్ మాల్స్‌కు మాత్రం అనుమ‌తి ఇవ్వ‌లేదు. గృహ‌స‌ముదాయాలు, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని షాపులకు అనుమ‌తి ఇచ్చింది. అయితే.. షాపుల్లో కేవ‌లం 50శాతం సిబ్బందితో ప‌నిచేయించుకోవాల‌ని ఆదేశించింది. ఈ సమ‌యంలో షాపుల వ‌ద్ద త‌ప్ప‌కుండా సామ‌జిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర‌హోంశాఖ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా ప్ర‌తీ ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల‌ని చెప్పింది. అయితే.. కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏమేర‌కు అమ‌లు చేస్తాయో చూడాలి మ‌రి.

 

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న దృష్ట్యా కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. నిజానికి.. ఏప్రిల్ 14న జాతిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మాట్లాడుతూ మే 3వ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 20వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఉంటాయంటూ మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేసింది. తాజాగా.. స్థానిక దుకాణాలు తెరుచుకునేలా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల‌తో వ్యాపారులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: