ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇప్ప‌టికే 220కు పైగా దేశాల్లో క‌రోనా వైర‌స్ పాకేసింది. ల‌క్ష‌ల మంది క‌రోనా బాధితులు అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 28 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2 లక్ష‌ల‌కు చేరుకుంది. రిక‌వ‌రీ కేసుల సంఖ్య 8 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. అగ్ర రాజ్య‌మైన అమెరికాలోనే ఈ కేసులు 9.25 ల‌క్ష‌లు దాటేసి 10 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతున్నాయి. 

 

క‌రోనా మ‌ర‌ణాలు ఇప్ప‌టికే అక్క‌డ 52 వేలు దాటేశాయి. గ‌త కొద్ది రోజులుగా అక్క‌డ స‌గ‌టున ఏకంగా 2 వేల‌కు పైగా రోజుకు క‌రోనా బాధితులు చ‌నిపోతున్నారు. అయితే కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం ఒక‌టి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెరికాలో క‌రోనా మ‌ర‌ణాలు 1258 మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. గ‌త కొన్ని రోజుల మ‌ర‌ణాల‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువ అనే చెప్పాలి. దేశంలో గ‌త మూడు వారాల్లో ఇదే అత్య‌ల్పం. మ‌రి దీనిని బ‌ట్టి చూస్తే అమెరికా ప్ర‌జ‌ల‌కు ఇది పెద్ద ఉప‌శ‌మ‌నం లాంటి న్యూసే.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: