ఓవైపు ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి కుదిపేస్తుంటే.. మ‌రోవైపు ఇరాన్ మిల‌టరీ శాటిలైట్ ప్ర‌యోగాలు చేస్తోంది. ఇరాన్‌లోనూ క‌రోనా వైర‌స్ తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఇప్ప‌టికే వేలాదిమంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సుమారు 90వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. సుమారు ఆరువేల‌కు చేరువ‌లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య ఉంది. క‌రోనా క‌ట్ట‌డిని ప‌క్క‌న‌బెట్టిన ఇరాన్ హాయిగా అంత‌రిక్షంలోకి మిల‌ట‌రీ శాటిలైట్‌ను ప్ర‌యోగించి ప్ర‌పంచాన్ని విస్మ‌యానికి గురిచేసింది. ఇరాన్ వ్య‌వ‌హారం ఒక్క‌సారిగా ఉత్త‌ర‌కొరియాను గుర్తు చేసింది. ఉత్త‌ర‌కొరియా కూడా ఇటీవ‌ల క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేసిన విష‌యం తెలిసిందే.

 

ఇంత‌టి క‌ష్ట‌కాలంలో ఇలాంటి ప‌నులు చేయ‌డం ఏమిటంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ మిల‌ట‌రీ శాటిలైట్ ప్ర‌యోగంపై అమెరికా కూడా స్పందించింది. ఇరాన్ చ‌ర్య‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించింది. యూఎస్ స్టేట్ సెక్ర‌ట‌రీ పోంపియో మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక ఉపగ్ర‌హాన్ని అంత‌రిక్షంలోకి ప్ర‌యోగించి, భ‌ద్ర‌తామండ‌లి తీర్మానాన్ని ధిక్క‌రించింద‌ని, దీనికి ఇరాన్ బాధ్య‌త‌వ‌హించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఇరాన్ దుస్సాహ‌సానికి పాల్ప‌డింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: