దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలోని రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేస్తున్నాయి. అయితే మన దేశంలోనే కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి సులువైన, అతి తక్కువ ఖర్చుతో కూడిన కిట్లు తయారయ్యాయి. 
 
ఐసీఎంఆర్ ఈ కిట్లకు ఆమోదం తెలపడంతో ఈ కిట్లనే మన దేశంలో ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. ఐఐటీ ఢిల్లీ రియల్ టైమ్ పీసీఆర్ ఆధారంతో రోగ నిర్ధారణ చేసేలా కిట్లను రూపొందించింది. దేశీయ కిట్లకు ఆమోదం లభించడంతో ఇకనుండి మన దేశం ఇతర దేశాలపై, విదేశీ కంపెనీలపై కిట్ల కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు. 100 శాతం కచ్చితత్వంతో ఈ కిట్లకు ఫలితాలు వస్తున్నాయని తేలింది. 
 
ఐఐటీ ఢిల్లీ ప్రస్తుతం ఈ తరహా కిట్లను వేల సంఖ్యలో రూపొందించేందుకు ప్రణాళిక రచించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: