దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా వ‌చ్చే వానాకాలంలో మరోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలో కంటిన్యూ అవుతోన్న లాక్ డైన్ వ‌చ్చే నెల 3వ తేదీతో ముగియ‌నుంది. ఆ త‌ర్వాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందా ?  లేదా ఎత్తేస్తారా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే లాక్ డౌన్ త‌ర్వాత కొద్ది రోజులు క‌రోనా త‌గ్గిన‌ట్టు ఉన్నా వ‌చ్చే వ‌ర్ష‌కాలంలో మాత్రం మ‌న‌దేశంలో ఇది తీవ్ర‌స్థాయిలో విజృంభించే అవ‌కాశాలు ఉన్నాయిన శాస్త్ర‌వేత్త‌లు, వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు.

 

ఆగ‌స్టులో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డితే క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ ప‌డ‌గ విప్పి కొన్ని ల‌క్ష‌ల మందికి సోక‌డంతో పాటు వేల మందిని బ‌లి తీసుకునే ప్ర‌మాదం మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే పొంచి ఉంద‌న్న అనుమానాలు వీరు వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి ఉచ్ఛ స్థితిని దాటి ప్రస్తుతం ఒకేస్థాయిలో కొనసాగుతున్నదని ప్రొఫెసర్‌ సమిత్‌ భట్టాచార్య పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధించేనాటికి దేశంలో 618 కేసులు, 13 మరణాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు కేసుల సంఖ్య 23వేలు, మరణాల సంఖ్య 700 దాటిందని, కేసుల రెట్టింపు వేగం తగ్గిందని, కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నదని గుర్తుచేశారు. ఏదేమైనా ప్ర‌తి ఒక్క‌రు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే మ‌న‌దేశం కూడా క‌రోనా దెబ్బ‌తో పెను ప్రమాదానికి గుర‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: