క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే.  ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే మే నెలాఖరు నాటికి దేశంలోని 4 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం కానున్నాయ‌ట‌. అవును మీరు వింటున్న‌ది నిజ‌మే.. హాండ్ సెట్ లలో వచ్చే లోపాలు, బ్రేక్ డౌన్ లు వంటి కారణంగా సెల్ ఫోన్లు ఉపయోగపడకపోవచ్చని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 

 

ఇదే విష‌యాన్ని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ పేర్కొంది. మొబైల్ ఫోన్ల విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, కొత్త హ్యాండ్‌సెట్ల విక్రయాలపై ఆంక్షల కారణంగా ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారాయని అంచనా వేసింది. అలాగే, హ్యాండ్ ‌సెట్లలో తలెత్తే లోపాలు, బ్రేక్‌డౌన్ల వల్ల మరికొన్ని మొబైల్స్ ప‌నికిరాకుండా పోయే ప్ర‌మాదం ఉందని తెలిపింది.  దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, నెలకు 2.5 కోట్ల ఫోన్ల అమ్మకాలు జ‌రుగుతున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: