ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. మే 3వ తేదీ త‌ర్వాత లాక్ డౌన్ నుంచి మిన‌హాయింపు ఇస్తే త‌ర్వాత ప‌రిస్థితులు మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తాయా ? అన్న సందేహాలు తీవ్రంగానే ఉన్నాయి. ఇక దీనికి తోడు వ‌ర్షాకాలం కూడా వ‌స్తుండ‌డంతో జూలై ఆఖర్లో లేదా ఆగస్టులో వైరస్‌ మళ్లీ వ్యాప్తిచెందే అవకాశం ఉంద‌న్న సందేహాలు దేశ‌వ్యాప్తంగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సందేహాలే ఇప్పుడు అంద‌రిని తీవ్రంగా ఆలోచించేలా చేస్తున్నాయి. అదే జ‌రిగితే జూలై, ఆగ‌స్టులో మ‌ళ్లీ లాక్‌డౌన్ త‌ప్ప‌ద‌నే అంటున్నారు.

 

లాక్‌డౌన్‌ తర్వాత వైరస్‌ వ్యాప్తివేగంపైనే ‘రెండో విజృంభణ’ తీవ్రత ఆధారపడి ఉంటుంద‌ని ప‌లువురు నిపుణులు చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే వైర‌స్ భారీన ప‌డి కోలుకున్న వారు సైతం మ‌ళ్లీ వైర‌స్ భారీన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని.. ఈ సారి తీవ్ర‌త‌ను బ‌ట్టి దేశంలో క‌ట్ట‌డి చేయ‌డం క‌ష్ట‌మ‌య్యే ప్ర‌మాదం కూడా ఉంద‌ని అంటున్నారు. దీనికి తగ్గట్టుగా వైద్య సదుపాయాలు మెరుగుపరుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

 

అయితే ఇందుకు కొన్ని నియంత్ర‌ణ మార్గాలు పాటిస్తే వ్యాధి తీవ్ర‌త‌ను ఆరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు. లాక్ డౌన్ త‌ర్వాత కూడా పూర్తిగా సోష‌ల్ డిస్టెన్స్ పాటించాలి... అలాగే కొన్ని నెల‌ల పాటు బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు ప్ర‌తి ఒక్క‌రు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలి. వేగంగా బాధితుల గుర్తింపు, ఐసొలేషన్‌ హాట్‌స్పాట్లను గుర్తించ‌డం.. అక్క‌డ ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌డం ద్వారా ప‌రిస్థితి కొంత వ‌ర‌కు అదుపులోకి తీసుకు రావ‌చ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: