క‌రోనా స‌హ‌జంగా పుట్టింది కాద‌ని, దానిని చైనానే సృష్టించింద‌నే వాద‌న రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. ఈ వాద‌న‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తూ రోజుకో కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మొన్న‌టికిమొన్న ఫ్రెంచ్ శాస్త్ర‌వేత్త‌, నోబెల్ గ్ర‌హీత కూడా చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్పుడు ఇదే దారిలో మ‌రో నోబెల్ గ్ర‌హీత చేరారు. క‌రోనా మహమ్మారిని చైనా దేశమే సృష్టించి ప్రపంచ దేశాల మీదకు వదిలిందని నోబెల్ బహుమతి గ్రహీత‌, జపాన్ జీవ‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇందుకు ఇదిగో ఆధార‌లంటూ ఆయ‌న ప్ర‌పంచం ముందుకు వ‌చ్చారు. ఒక‌వేళ కరోనా వైరస్ సహజంగా పుట్టి ఉంటే యావత్ ప్రపంచాన్ని ఒకే రకంగా అతలాకుతలం చేసి ఉండేదని, కాని ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయ‌ని, కేవ‌లం చైనా ల‌క్ష్యంగా చేసుకున్న దేశాల్లోనే క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తోందని జసాన్ శాస్త్రవేత్త స‌రికొత్త వాద‌న ముందుకు తీసుకొచ్చారు. వైర‌స్ స‌హ‌జంగా పుట్టి ఉంటే.. వివిధ దేశాల ఉష్ణోగ్రతలను బట్టి వైరస్ ప్రభావం వేరు వేరుగా ఉండేదని.. చైనాతో సమానమైన ఉష్ణోగ్రత ఉన్న దేశాలను మాత్రమే ప్రతికూలంగా ప్రభావితం చేసి ఉండేదని ఆయ‌న పేర్కొన్నారు. కానీ ఈ వైరస్ స్విట్జర్లాండ్, జర్మనీ వంటి శీతల దేశాలను సైతం తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తీస్తోంద‌ని, అదే సమయంలో వేడి ఎక్కువగా ఉండే దేశాలలో సైతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని డాక్టర్ తసుకు హోంజో చెబుతున్నారు. 

 

జంతువులు, వైరస్‌లపై గత 40 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నానని, కరోనా వైరస్ క‌చ్చితంగా సహజమైనది కాదని, ఇది ముమ్మాటికి మ‌నిషి సృష్టించిందేన‌ని డాక్టర్ తసుకు హోంజో ఆరోపిస్తున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే..  డాక్టర్ తసుకు హోంజో చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో నాలుగేళ్లు  పనిచేశాన‌ని అంటున్నారు. ఆ ప్రయోగశాలలో పనిచేసే సిబ్బంది అందరితో పరిచయం ఉందని, కరోనావైరస్ కనిపించిన తరువాత వారందరినీ తాను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేయగా వారి ఫోన్‌లన్నీ గత మూడు, నాలుగు నెలలుగా స్పందించడం మానేసాయని చెప్పుకొచ్చారు. అంటే ఈ ల్యాబ్ లో పనిచేసిన టెక్నీషియన్లందరూ కరోనాతో మృతి చెందార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో చైనాకు ఆయ‌న స‌వాల్ కూడా విసిరారు. కరోనా చైనా సృష్టించింది కాదని నిరూపిస్తే నోబుల్ వెనక్కి ఇస్తా.. అంటూ స‌వాల్ విసిరారు. చైనా గుట్టు త్వ‌రలోనే బ‌ట్ట‌బ‌య‌లు అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. దీంతో చైనాపై అంత‌ర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. అమెరికాకు మ‌ద్ద‌తుగా ఇటీవ‌ల ఆస్ట్రేలియా నిలిచింది. ఇప్పుడు ఆ జాబితాలో జ‌పాన్ కూడా చేరింది. దీనీపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: