ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర‌స్ ఉధృతి కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కలిపి శ‌నివారం మ‌ధ్యాహ్నానికి పాజిటివ్ కేసుల సంఖ్య 28 లక్షల 25 వేలు దాటింది. మరణాలు 2 లక్షల చేరువలో ఉన్నాయి. ఆయా దేశాలు క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ ను ప‌టిష్టంగా అమలు చేస్తున్న‌ప్ప‌టికీ .. పాజిటివ్ కేసుల సంఖ్య పె రిగిపోతుండ‌టం గ‌మ‌నార్హం.  ఇక అమెరికాలో అయితే క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇక్కడ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. న్యూ యార్క్ న‌గ‌రంలో కేసుల సంఖ్య‌ అధికంగా ఉంది.

 

ఇక రష్యా, బ్రిటన్‌, స్పెయిన్‌, ఇట‌లీలో వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకకు 2, 830, 082 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  అలాగే కరోనా బారిన పడి ఇప్పటి వరకు 1,97,246 మంది మృతి చెందారు. ఈ రోజు కొత్తగా 1,465 మందికి కొవిడ్ -19  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే క‌రోనా బారిన ప‌డి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు 155 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: