దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్కువగా ఉండటంతో ఆయన కొన్ని కఠని చట్టాలు తీసుకు వస్తున్నారు.  ఇటీవల ఆయన తండ్రిగారు కాలాం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి అంతిమసంస్కారాలకు తాను హాజరు కాలేకపోతున్నానని, ‘కరోనా’ కట్టడికి చేస్తున్న పోరాటం నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 23 కోట్ల మంది ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.

 

తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంత వరకు కంట్రోల్ లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. జూన్ 30వ తేదీ వరకు జనాలు గుమికూడటంపై ఆంక్షలు కొనసాగుతాయని ఆదేశాలను జారీ చేశారు.  వీటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించమని ఆయన తేల్చి చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం ముందే ప్రకటించినట్లు మే 3 వరకూ లాక్‌డౌన్ అమలులో ఉంటుందన్న విషయం తెలిసిందే.

 

ఒకవేళ దేశంలో కరోనా కేసులు తగ్గి, కేంద్రం మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు యూపీకి అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు, యూపీలో ఇప్పటి వరకు 1,600కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 25 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలను పోగోట్టుకున్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: