‘‘కరోనా వైరస్ విరుగుడుకు ఓ ప్రత్యేకమైన ప్రాణాయామ ప్రక్రియ ఉంది. దానిని ‘ఉజ్జై’ అని పిలుస్తాం. ముక్కు ద్వారా లోతుగా గాలి పీల్చుకున్నాక కాసేపు ఊపిరి బిగపట్టాలి. ఆ తరువాత నిదానంగా వదలాలి. దీన్ని ఉజ్జయ్ ప్రాణాయామం అంటారు. ఇది కరోనా పని పడుతుంది’’ అని అంటున్నారు యోగా గురువు రాందేవ్ బాబా. 

 

ఒక నిమిషం పాటు ఊపిరి పీల్చుకోవడం ఆపగలిగిన వారికి కరోనా వైరస్ గానీ, దాని లక్షణం గానీ లేనట్లేనని రాందేవ్ బాబా తెలిపారు. రోగ లక్షణాలు ఉన్నా లేకున్నా సరే దీని ద్వారా కరోనా నిర్థారణ చేయవచ్చన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  దీర్ఘకాలిక రక్తపోటు, గుండె సమస్యలు, డయాబెటిస్‌ ఉన్నవారు, వృద్ధులు 30 సెక‌న్ల‌ పాటు శ్వాసను ఆపగలుగుతారని, యవ్వనంలో ఉన్నవారు ఒక నిమిషం పాటు ఆపగలుగుతారని అన్నారు. ఇలా చేస్తే కోవిడ్ -19 లక్షణంతో పాటు రోగ లక్షణం కూడా లేనట్లేనని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఈ ఉజ్జై ప్రాణా యామానికి ముందే ముక్కులోకి ఆవ నూనె పోసుకుంటే.. వైరస్ అంతా కడుపులోకి వెళ్లి అక్కడున్న యాసిడ్‌లో పడి నాశనమైపోతుందని కూడా రాందేవ్ బాబా తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: