క‌రోనా క‌ట్ట‌డిలో ఏపీ వినూత్న విధానాల‌ను అవ‌లంభిస్తోంది. మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతోంది. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లను వేగ‌వంతం చేయ‌డానికి సొంతంగా కిట్ల త‌యారీని ప్రారంభించిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. ద‌క్షిణ కొరియా నుంచి ఏకంగా ల‌క్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను తెప్పించింది. రోజుకు సుమారు 5వేల‌కుపైగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తూ మిగ‌తా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది. అతేగాకుండా.. లాక్‌డౌన్ అమ‌లులో కూడా ఏపీ టాప్‌లో నిలిచింది. జాతీయ మీడియా సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది. అంతేగాకుండా.. క‌రోనా వైర‌స్ చికిత్స‌ను ఆరోగ్య శ్రీ ప‌థ‌కంలో చేర్చింది. రాష్ట్రంలోని మెజార్టీ ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను కొవిడ్ వైద్య‌సేవ‌లు అందించేందుకు ప్ర‌భుత్వం త‌న ఆధీనంలోకి తీసుకుంది. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారు పౌష్టిక‌మైన ఆహారం తీసుకునేందుకు ఒక్కొక్క‌రికి రూ.2వేల‌ను కూడా అందిస్త‌న్నారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. క‌రోనా వ్యాప్తి నిరోధానికి ఇలాంటి ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్న నేప‌థ్యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఏపీ స‌ర్కార్‌ను అభినందించింది.

 

తాజాగా.. ఏపీపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీ అనుస‌రిస్తున్న విధానాల‌పై అధ్య‌య‌నం చేసేందుకు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని వైసీపీ నేత,ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. *రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపి దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. డ‌బ్ల్యూహెచ్‌వో కూడా ఆరా తీస్తోంది* అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: