దేశంలో కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంటుంది.  ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఈ లాక్ డౌన్ వచ్చే నెల 3 వరకు పొడిగించారు. కానీ కొన్ని చోట్ల కరోనా ప్రభావం తక్కువగా ఉంటే.. నివాస ప్రాంతాల్లో షాపులు తెరిచేందుకు వీలుగా లాక్ డౌన్ నిబంధలను సడలిస్తూ నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

అయితే మాస్కులు, గ్లవ్స్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివి చేయాలని షరతు విధించింది. దీంతో ఢిల్లీ ప్రజలు హమ్మయ్య అనుకున్నారు. ట్రాన్స్ పోర్టేషన్ ఇంకా పునఃప్రారంభం కాకపోవడంతో... షాపుల్లో పని చేసేవారు రాలేకపోతున్నారు. దీంతో, షాపులు ప్రారంభం కాలేదు.  కాకపోతే జనసందోహం ఎక్కువగా ఉండే.. మాల్స్, హెయిర్ సెలూన్లు, రెస్టారెంట్లు, లిక్కర్ షాపులు, జిమ్ లు, స్మిమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లు, స్పోర్ట్ కాంప్లెక్సులను కూడా తెరవడానికి వీల్లేదని కేంద్ర స్పష్టం చేసింది.

 

కాకపోతే ఢిల్లీలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.  ఈ నేపథ్యంలో షాపుల్లో పని చేసేవారు రాలేకపోతున్నారు.   మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపులపై  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకముందే సడలింపులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: