చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ఒకటి కాదు రెండు కాదు లక్ష దాటిన మరణాలు.. లక్షల్లో కరోనా కేసులతో సతమతమవుతున్నారు.  అమెరికాల లాంటి అగ్ర రాజ్యయంలో కూడా కరోనా విళయతాండవం చేస్తుంది.  ఇక దేశంలో కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రజలు ఎక్కడికి వెళ్లవొద్దని ఇంటి పట్టున ఉండాలని చెబుతున్నారు. కానీ కొంత మంది నిర్లక్ష్యం వారి ప్రాణాల కే కాదు ఇతరులకు కూడా ప్రాణసంకటంగా మారిపోతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

 

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అయితే ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లాలోని నూజివీడులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్థారణ అయిందని వైద్యులు తెలిపారు.  ఇప్పటికే గుంటూరు, కృష్ణ, కర్నూల్ లో కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం పై  ప్రభుత్వం సైతం సీరియస్ గా ఫోకస్ పెట్టింది.  ఇక్కడ సాధ్యమైనంత వరకు లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేయాలని సూచించింది.  కొద్ది మంది నిర్లక్ష్యం మూలాన కరోనా వ్యాప్తిని అరికట్టడం ఇబ్బంది అంటున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: