యూరప్ లో కరోనా  వైరస్ రోజురోజుకు విజృంబిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కూడా లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే ప్రజలు బయటకు రాకుండా అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రజలు నిత్యవసర వస్తువులు సహా పలు వస్తువులను కొనుక్కునేందుకు ఎక్కడికి దుకాణాలకు వెళ్లేందుకు బయటకి వెళ్లకుండా  అక్కడి అధికారులు తగిన చర్యలు చేపట్టారు దీని కోసం... ప్రజలకు రోబోట్ లని  అందుబాటులోకి తీసుకొచ్చారు. రోబోట్ ద్వారానే ప్రజలకు కావాల్సిన అన్నింటిని డెలివరీ చేస్తున్నారు. లండన్ లో కఠినమైన సామాజిక దూర చర్యలను విధించిన నేపథ్యంలో... ప్రజలు బయటకు రాకుండా ప్రజల వద్దకే నిత్యవసర వస్తువులు వెళ్లేలా ఇలా రోబోట్ ద్వారా డెలివరీ  చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా కరోనా ను అరికట్టవచ్చని  అక్కడి అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: