ఓ వైపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఎక్క‌డి వ్య‌వ‌స్థ‌లు అక్క‌డే ఆగిపోయాయి. ఎవ‌రికి వారు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితులు కూడా లేవు. ఇక సెల‌బ్రిటీలు అయితే ఇళ్లలోనే ఉంటూ ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. కొంద‌రు తాము ఇళ్ల‌లో ఉంటూ ఇంటి ప‌ని.. వంట ప‌ని చేసే వీడియోలు రిలీజ్ చేస్తుంటే మ‌రి కొంద‌రు మాత్రం ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక భ‌రోసా క‌ల్పించే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ఛాలెంజ్ చేసుకుంటూ ఒక‌రిని మ‌రోక‌రు నామినేట్ చేసుకుంటూ వీడియోలు రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ డైరెక్ట‌ర్ ర‌విబాబు ఓ వినూత్న ప్ర‌యోగం చేశారు. త‌న తండ్రి చ‌ల‌ప‌తిరావుతో క‌లిసి క్వారంటైన్ యానివ‌ర్సిరీ జ‌రుపుకున్నారు. ఇందులో క‌రోనా వైర‌స్ న‌మూనాతో ఉన్న కేక్ తింటూ ర‌వి బాబు ఏడ్చేశాడు. కొడుకు ర‌విబాబు చిత్ర విచిత్ర చేష్ట‌లు చూసిన చ‌ల‌ప‌తిరావు నెత్తికొట్టుకుని అక్క‌డ నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: