ఇంట్లో జ‌రిగిన‌ గొడ‌వ‌లతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఓ అమ్మాయిని ఆత్మ‌హ‌త్య చేసుకోబోతుండ‌గా మంచిర్యాల పోలీసులు ర‌క్షించారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మంచిర్యాల‌ జిల్లాలోని శ్రీరాంపూర్‌కు చెందిన స‌ద‌రు యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంటానని గోదావ‌రి బ్రిడ్జ్ వైపు న‌డుచుకుంటూ వెళ్లింది. ఇంత‌లో ఆ అమ్మాయిని గుర్తించిన ఎస్సైలు విజేంద‌ర్‌, మంగిలాల్‌లు.. ఆమెను అడ్డుకుని స‌ర్దిచెప్పి త‌ల్లితండ్రుల‌కు అప్ప‌గించారు. యువ‌తి ప్రాణాల‌ను కాపాడిన పోలీసుల‌ను ఈ సంద‌ర్భంగా డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి  మెచ్చుకున్నారు.  విప‌రీత‌మైన భావోద్వేగాలు మాన‌సిక సంక్షోభానికి దారి తీస్తాయ‌ని, దాని వ‌ల్ల గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌ని, త‌ప్పుగా అర్థం చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని, ఇది ఎవ‌రికైనా హానిక‌ర‌మే అని డీజీపీ ఈ  త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.

 

క్ష‌ణికావేశంలో తీసుకునే నిర్ణ‌యాలు మంచివి కావని.. ఓ క్ష‌ణంపాటు ఆలోచిస్తే ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుందని..  కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తే ఎటువంటి స‌మ‌స్య‌లైనా ప‌టాపంచ‌లు అవుతాయని ఆయ‌న పేర్కొన్నారు.  అమ్మాయి ప్రాణాలు కాపాడిన పోలీసుల్ని కూడా త‌న డీజీపీ మెచ్చుకున్నారు. వారిని డియ‌ర్ ఆఫీస‌ర్స్ అని సంబోధిస్తూ.. స‌రైన స‌మ‌యంలో స‌మ‌స్య‌ను గుర్తించి, మంచి మాట‌ల‌తో మాన‌సికంగా కుంగిపోయిన అమ్మాయిని ర‌క్షించారంటూ.. అభినందించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: