క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మై పోయారు. నిత్యావ‌స‌రాలు, అత్యావ‌స‌రాల‌కు త‌ప్ప మిగ‌తా స‌మ‌యాల్లో ఇంటి నుంచి అడుగుబ‌య‌ట‌పెట్ట‌డం లేదు. అయితే..ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లోనూ రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ లోని ఒక ఆలయంలో ఓ పెళ్లి జ‌రిగింది. అయితే.. వరుడు, వధువు త‌ప్ప బంధువులెవరూ హాజ‌రుకాలేదు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ఈ పెళ్లి జ‌రిపించారు. వధువు తాత తీవ్ర‌ అనారోగ్యంతో ఉన్నాడు. లాక్‌డౌన్‌కు ముందుగానే వీరి పెళ్లి తేదీని నిర్ణ‌యించారు. అయితే.. అదే తేదీన‌ వివాహం జరగాలని ఆమె తాత‌ కోరుకున్నాడు.

 

దీంతో తాత కోరిక మేర‌కు ఆల‌యంలో వ‌ధూవ‌రులు మాత్ర‌మే హాజ‌రై పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో సామాజిక దూర నిబంధనలను కూడా పాటించామ‌ని వరుడు వరుణ్ ధధానియా చెప్పారు. త‌మ‌ బంధువులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివాహాన్ని చూశారని తెలిపారు. అలాగే, ప్ర‌ధాన‌మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు రూ .4 లక్షలు, రాజస్థాన్ సీఎం కోవిడ్ ఫండ్‌కు రూ .1.1 లక్షలు విరాళంగా ఇచ్చామని వరుడు వ‌రుణ్ చెప్పారు. ఇలా ప్ర‌పంచంలో అక్క‌డ‌క్క‌డ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో శుభ‌కార్యాలు జ‌రుగుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: