క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు అనేక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌సేవలు అందిస్తున్న డాక్ట‌ర్లు, న‌ర్సులు కూడా ఎక్కువ సంఖ్య‌లో వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. పేషెంట్ల‌కుచికిత్స చేసే క్ర‌మంలో వారికి వైర‌స్‌సోకుతోంది. పీపీఈ కిట్లు ధ‌రించినా.. అనేక‌ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నా.. ఈ మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకోలేక‌పోతున్నారు వైద్యులు. ఈ నేప‌థ్యంలోనే ప్రాణాల‌కు తెగించి వైద్య‌సేవ‌లు అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను, న‌ర్సుల‌ను కాపాడుకునేందుకు కొత్త‌కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తున్నాయి. గుజ‌రాత్‌లోని ష్యూర్ సేఫ్టీ కంపెనీ వారు వంద‌శాతం ర‌క్ష‌ణ క‌ల్పించే పీపీఈ కిట్ల‌ను త‌యారు చేశారు.

 

తాజాగా.. బెంగ‌ళూరులో మ‌రో ప్ర‌యోగం చేస్తున్నారు. డాక్ట‌ర్లు, న‌ర్సులు రోగులకు కావాల్సిన మందులు, ఆహారం ఇచ్చేందుకు పేషెంట్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదిక‌. ఈ ప‌నుల నుంచి మెడిక‌ల్ స్టాఫ్‌కు కొంత విముక్తి క‌ల్పించేందుకు రోబోను రంగంలోకి దించారు. బెంగ‌ళూరులోని విక్టోరియా ఆస్ప‌త్రిలో రోబో సాయంతో మందులు, ఆహారాన్ని రోగుల‌కు అందిస్తున్నారు. ఆస్ప‌త్రి సిబ్బందిని క‌రోనా బారి నుంచి కాపాడేందుకు ఈ రోబో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ ప‌ర్య‌వేక్షించే అవ‌కాశం ఈ రోబోతో ఏర్ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: