ప్రపంచ దేశాల్లో కోవిడ్‌–19 మరణ మృదంగం  కొనసాగుతూనే ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. అందులో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది అమెరికాలో మరణించగా మూడో వంతు కేసులు అక్కడే నమోదయ్యాయి. అమెరికాలో కేసులు 9 లక్షలు దాటితే, మృతుల సంఖ్య 52 వేలు దాటేసింది. ఇక యూరప్‌ లక్షా 20 వేలకు పైగా మరణాలతో మొదటి స్థానంలో ఉంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌ దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి.  

 

అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ముస్లింల‌కు అత్యంత ప‌విత్ర‌మైనమైన రంజాన్ మాసం  క‌ళ త‌ప్పింది.  రంజాన్‌ మాసం మొదలైనా ఎక్కడా సందడి కని పించడం లేదు. కోవిడ్‌ భయాందోళనల నేపథ్యంలో ముస్లిం దేశాలన్నీ రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులపై నిషేధం విధించాయి. ఎవరింట్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని సూచించాయి. లక్షలాది మంది ముస్లింలతో నిండిపోయే సౌదీ అరేబియాలోని మక్కా మసీదు ఎవరూ లేక బోసిపోతోంది. ప విత్రమైన మక్కాలో జన సందోహం లేకుండా చూస్తే చెప్పలేని బాధ కలుగుతోందని మతాధికారి అలీముల్లా వ్యాఖ్యానించారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: