లాక్‌డౌన్ కార‌ణంగా వ‌ల‌స కార్మికుల జీవితాలు దుర్బరంగా మారాయి. నిలువ నీడ‌లేక‌... తిన‌డానికి తిండిలేక‌.. ఊరుగానీ ఊరులో వారు ప‌డుతున్న అ వ‌స్థ‌లు వ‌ర్ణ‌ణాతీతం. ఈ క్ర‌మంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులు తమ స్వ‌స్థ‌లాల‌కు  చేరుకునేందుకు  అన్ని ర‌కాలుగా ప్రయత్నిస్తున్నారు. వంద‌లు, వేల కిలోమీర్ల దూరం కాలిన‌డ‌క‌న బ‌య‌లుదేరి అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల చూస్తూనే ఉన్నాం.. తాజాగా  హర్యానాలోని పా నిపట్‌లో చిక్కుకున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 12 మంది కార్మికులు న‌దిని ఈదుకుంటూ ఇంటిక చేరేందుకు ప్ర‌య‌త్నించారు. పోలీసుల‌కు చిక్కి, చివ‌రి కి క్వారంటైన్ కు చేరాల్సి వ‌చ్చింది.  

 

పానిపట్ లోని కూరగాయల మార్కెట్లో పనిచేసే 12 మంది కార్మికులు ...  పానిపట్ నుండి 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూపీలోని కౌశాంబికి బయలుదేరారు. హర్యానా- యూపీ సరిహద్దులో ప్రవహించే యమునా నదిలో ఈదుతూ యూపీకి చేరుకున్నారు. యమున న‌ది దాటిన తరువాత వారంతా షామ్లీ జిల్లాకు చేరుకున్నారు. షామ్లీలోని గంగేరు గ్రామ ప్రజలు వారిని చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వారందరినీ అక్క‌డే ఆపి, స‌మీపంలోని క్వారంటైన్‌కు తర‌లించారు.  దీంతో ఆందోళ‌న‌కు గురైన పోలీసులు..  నదికి  కాపలా కాస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: