ప్రపంచ కరోనా మహమ్మారి ప్రబలి పోతుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి భయంకరంగా మారుతుంది. ఇప్పటికీ రెండు లక్షలకు మరణాల సంఖ్య పెరిగిపోయింది.  లక్షల్లో కేసులు పెరిగిపోతున్నాయి.  అమెరికాలో ఏకంగా 50 వేలు మరణాల సంఖ్య దాటాయంటే అర్థం చేసుకోవచ్చు.  ఇటలీ, ఫ్రాన్స్ మరికొన్ని దేశాల్లో వేల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి.  శనివారానికి మృతుల సంఖ్య 2,03,274 కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 29,21,030 అని గణాంకాలు చెబుతున్నాయి.

 

జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం, కరోనా విజృంభించిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లోని కేసుల మొత్తం కన్నా, యూఎస్ లోనే అధిక కేసులు ఉన్నాయి.   ఇక యూఎస్ లో కరోనా కొత్త కేసుల సంఖ్య సగటున 38 శాతం నుంచి 28 శాతానికి తగ్గాయని, కొన్ని రాష్ట్రాల్లో ఇది 15 శాతానికి పడిపోయిందని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.

 

మొత్తం కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు అమెరికాలోనే సంభవించడం గమనార్హం.  ఇకపై రోజుకు 5 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయాలని హార్వార్డ్ వర్శిటీ సలహా ఇచ్చింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న న్యూయార్క్ లో కేసుల సంఖ్య 2.88 లక్షలకుపైగా నమోదు కాగా, మృతుల సంఖ్య 21,908కు చేరింది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: