క‌రోనాపై జ‌రిగే పోరాటంలో ప్ర‌తి పౌరుడు సైనికుడే అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. క‌రోనాపై జ‌రిగే యుద్ధంలో దేశ‌మంతా ఒకే ల‌క్ష్యంతో ముం దుకెళ్తోంద‌ని అన్నారు. ఈ యుద్ధంలో ప్ర‌జ‌లే నాయ‌క‌త్వం వ‌హిస్తున్నార‌ని అన్నారు.  క‌రోనా నియంత్ర‌ణ‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌న్‌కీ బాత్  నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న జాతినుద్దేశించి మాట్లాడారు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న‌ చ‌ర్య‌లు, లాక్‌డౌన్ అమ‌లువంటి అంశాల‌ను ప్ర‌స్తావించారు. 

 

క‌రోనాపై మ‌నం స‌రైన రీతిలోనే యుద్ధం చేస్తున్నామ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ లాక్ డౌన్ పాటిస్తున్నార‌ని అన్నారు. క‌రోనాపై జ‌రిగే యుద్ధంలో మ‌నదే గెలుప‌ని, క‌రోనా అంతం త‌ర్వాత స‌రి కొత్త భార‌త్‌ను చూడ‌బోతున్నామ‌ని  పేర్కొన్నారు. ప్ర‌జ‌లెవ‌రూ ఆక‌లి ఉం డ‌కూడ‌ద‌ని రైతులంతా పోరాడుతున్నార‌ని అన్నారు. క‌రోనాపై జ‌రిగే పోరాటంలో దేశం ఐక‌మ‌త్యాన్ని చాటుతుంద‌ని మోడీ అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: