దేశంలో కరోనా ఏ రేంజ్ లో ప్రబలి పోతుందో అందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వాలు విన్నవించుకుంటున్నాయి.  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని వచ్చే నెల 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్  మే 7 వరకు పొడిగించారు.  అయితే కొన్ని చోట్ల డేంజర్ పరిస్థితులుఉన్నాయని కంటైన్ మెంట్స్ గా ఏర్పాటు చేశారు.

 

 ఇక్కడ లాక్ డౌన్ సీరియస్ గా కొనసాగిస్తున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్ లో కరోనా తగ్గు ముఖం పట్టింది.  హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న కంటైన్ మెంట్ జోన్లలో 45 జోన్లను ఎత్తివేసినట్టు అధికారులు వెల్లడించారు.  ఇప్పుడు ఈ జోన్లలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి కావడంతో నిబంధనలను తొలగించామని, అయినా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మిగతా ప్రాంతాల్లో మాదిరిగా తగు జాగ్రత్తలు తీసుకుని, తమతమ రోజువారీ పనులను చేసుకోవచ్చని వెల్లడించారు.

 

ఈ ప్రాంతాల్లో కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులు కోలుకోవడం, ఆపై కొత్త కేసులు నమోదు కాకపోవడం, కాంటాక్టు కేసుల జాడ లేకపోవడంతో దశల వారీగా ఈ జోన్లలో నిబంధనలను సడలిస్తూ వచ్చారు.  మరికొన్ని జోన్లలో రేపటి నుంచి దశలవారీగా ఆంక్షలను సడలించనున్నట్టు వెల్లడించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: